Lionel Messi : ‘గోట్ ఇండియా టూర్’లో లియోనల్ మెస్సీ(Lionel Messi) భారత్‌లోని ప్రధాన నగరాల్లో సందడి చేస్తున్నాడు. మూడు రోజుల పర్యటన కోసం విచ్చేసిన అర్జెంటీనా స్టార్ తన బృందంతో కలిసి ఆదివారం ముంబై (Mumbai)లో వాలిపోయాడు. విమానాశ్రయంలో ఫుట్‌బాల్ దిగ్గజానికి ఘన స్వాగతం లభించింది. దేశ ఆర్ధిక రాజధానిలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సినీ, రాజకీయ ప్రముఖులు సాకర్ మాంత్రికుడిని కలువనున్నారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అభిమానుల దిల్ ఖుషీ చేసిన మెస్సీ.. పర్యటనలో రెండో రోజు ముంబైలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాడు. స్థానిక బ్రొబ్రౌనే స్టేడియంలో ఫ్యాన్స్‌ను కలిసిన తర్వాత.. గ్రామీణ ప్రాంతాల్లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్ మహదేవను మెస్సీ ప్రారంభిస్తాడు. అనంతరం రాత్రి వాంఖడే స్టేడియంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో అభిమానులను అలరించనున్నాడీ లెజెండ్. ముంబైలో మెస్సీ బృందం పూర్తి షెడ్యూల్ తెలుసుకుందాం.
🚨 WATCH: Leo Messi at Brobroune Stadium in Mumbai to Greet with Fans and Bollywood Celebrities. 🐐 pic.twitter.com/6nUdVVfqMH
— Sam (@HereToTroll72) December 14, 2025
సాయంత్రం 5:50 గంటలకు వాంఖడేలో ఎగ్జిబిషన్ మ్యాచ్ మొదలవుతుంది.
సాయంత్రం 6:05 గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పిచ్ వద్దకు వెళ్తారు.
సాయంత్రం 6:07 గంటలకు మెస్సీ మైదానంలోకి దిగుతాడు. ఒక నిమిషం తర్వాత అతడి బృందంలోని సూరజ్ డీపౌల్ కూడా మైదానంలో వెళ్తారు.
#WATCH | Mumbai: Bandra-Worli sea link illuminated with the image of Football star Lionel Messi, who is in India for his G.O.A.T India Tour.
Lionel Messi will be in Mumbai tomorrow to greet his fans. pic.twitter.com/PwsqUg6aZ3
— ANI (@ANI) December 13, 2025
సాయంత్రం 6:11 గంటలకు మెస్సీ, సీఎం ఫడ్నవీస్ సరదాగా ఫుట్‌బాల్ ఆడుతారు.
సాయంత్రం 6:12 గంటలకు పెనాల్టీ షూటౌట్.
సాయంత్రం 6:15 గంటలకు విజేత, రన్నరప్ జట్లతో ఫొటోషూట్.
సాయంత్రం 6:30 గంటలకు మెస్సీ పెనాల్టీ షూటౌట్.
సాయంత్రం 6:32 గంటలకు ఫుట్‌బాల్ స్టార్ సునీల్ ఛెత్రీ, సచిన్ టెండూల్కర్‌ను మెస్సీ కలుస్తాడు.
సాయంత్రం 6:38 గంటలకు అభిమానులకు అభివాదం చేస్తూ మెస్సీ బృందం మైదానంలో నడుస్తుంది.
VIDEO | Mumbai: Fans in large numbers gather ahead of footballer Lionel Messi’s arrival at Wankhede Stadium.
(Full video available on PTI Videos – https://t.co/dv5TRAShcC) pic.twitter.com/qRrxuQ4YhU
— Press Trust of India (@PTI_News) December 14, 2025
సాయంత్రం 6:48 గంటలకు అతిథులను వేదికమీదకు ఆహ్వానిస్తారు.
సాయంత్రం 6:51 గంటలకు గోట్ ఇండియా టూర్ నిర్వాహకులతో మెస్సీ ఫొటోషూట్.
సాయంత్రం 6:53గంటలకు గోట్ కప్‌ను మెస్సీ ప్రదానం చేస్తాడు.
సాయంత్రం 6:54గంటలకు సీఎం ఫడ్నీవీస్ మెస్సీని సన్మానిస్తారు.
సాయంత్రం 655 గంటలకు లియస్ సూరజ్, డి పౌల్‌ను సన్మానిస్తారు.
సాయంత్రం 6:57 గంటలకు వాంఖడేలో కార్యక్రమం ముగుస్తుంది.