వనపర్తి : ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ( Congress government) ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తాము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేని దుస్థితి ఏర్పడింనది వెల్లడించారు.
ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో యువ నాయకుడు ఏరువ సాయిప్రసాద్ యాదవ్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా కింద రూ. 15వేలు ఇస్తామని, ఆసరా పింఛన్లు రూ. 4వేలు , కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని మోసం చేశారరని ఆరోపించారు.
మహిళలకు రూ. 2,500ఇస్తామని, ధాన్యంపై క్వింటాలుకు బోనస్ రూ. 500ఇస్తామని ఎగ్గొట్టారని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు ఎన్నో ఆంక్షలు పెట్టి అర్హులకు అందకుండ చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయంలో నియోజకవర్గంలో 3,250 డబుల్ బెడ్ రూమ్స్ కట్టించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను నాయకులు,కార్యకర్తలు ప్రజలకు వివరించి స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమములో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ , పార్టీ మండల అధ్యక్షులు కే.మాణిక్యం, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, కురుమూర్తి యాదవ్, సింగిల్ విండో అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ రావు, నాయకులు మాధవ్ రెడ్డి, రవిప్రకాష్ రెడ్డి, డేగ మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాము, ఇమ్రాన్, మాజీ కౌన్సిలర్లు నాగన్న యాదవ్, ప్రేమ్ నాథ్ రెడ్డి, నాయక్, తదితరులు పాల్గొన్నారు.