పవన్‌కల్యాణ్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. గత కొన్ని రోజులుగా వారంతా ఆతృతగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ ట్రైలర్ సోమవారం విడుదలైంది. ఓజాస్ గంభీర పాత్రలో పవన్‌కల్యాణ్ వింటేజ్ ైస్టెల్లో అదరగొట్టాడు. భారీ యాక్షన్ ఘట్టాలు, గ్రిప్పింగ్ డ్రామా కలబోతగా ట్రైలర్ ఆకట్టుకుంది. అజ్ఞాతవాసం అనంతరం ముంబయి మాఫియాలో ప్రత్యర్థులను ఖతం చేయడానికి నగరానికి తిరిగొస్తాడు ఓజాస్ గంభీర.
ఈ క్రమంలో ప్రతినాయకుడు ఇమ్రాన్‌హష్మీతో అతను చేసిన ముఖాముఖీ పోరాటం ఉత్కంఠను పంచింది. ‘బాంబే వస్తున్నా..తలలు జాగ్రత్తా’ అంటూ ఓజాస్ గంభీర ఇచ్చిన వార్నింగ్ హైలైట్‌గా నిలిచింది. విజువల్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. దర్శకుడు సుజీత్ తనదైన ైస్టెలిష్ మేకింగ్‌తో సినిమాను తీర్చిదిద్దారు. ఇమ్రాన్హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాష్‌రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్‌దాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు: డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి, దర్శకత్వం: సుజీత్.