ములుగు, సెప్టెంబర్ 22: ఉద్యా న విశ్వవిద్యాలయం యొక్క పరిశోధనలు, శిక్షణ, సాంకేతికత వినియోగం తదితర సేవలు విదేశాలకు సైతం అందనున్నాయి. ఈ మేరకు సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో వీసీ దండా రాజిరెడ్డి అధ్యక్షతన ఐవర్కోస్ట్ దేశానికి చెందిన విత్తన ఉత్పత్తిదారుల, నర్సరీల సమాఖ్య అధ్యక్షుడు ట్రోర్మామ్డన్, అధ్యక్ష, కార్యదర్శి బ్రాన్కోఫీ సెబాస్టియన్, పశ్చిమ ఆఫ్రికాలోని నర్సరీ యజమాని అస్సేకోఫీ ఫ్రాన్సిస్ సమావేశమై వర్సిటీ సహాయ సహకారాలు అర్జించారు.
సహకారానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల గురించి చర్చించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరికరాల వినియోగం, కణజాల వర్ధనం, పండ్లు, పూల, ఔషధ, కోకో, కాసావా మొక్కల విత్తన ఉత్పత్తి వంటి పలు అంశాలపై వర్సిటీ సహకారం అందించాలని విదేశీయులు కోరినట్లు వీసీ తెలిపారు. పూర్తిస్థాయిలో ప్రణాళికలు రూపొందించి సహకారం అందించేందుకు సానుకూలంగా ఉన్నట్లు వీసీ తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు భగవాన్, రాజశేఖర్, శ్రీనివాసన్ పాల్గొన్నారు.