Pawan Kalyan Birthday OG Glimpse | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులకు తీపికబురు అందింది. పవన్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీ నుంచి బర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ”డియర్ ఓజీ.. నిన్ను కలవాలని.. నీతో మాట్లాడాలని.. నిన్ను చంపాలని ఎదురుచూస్తున్న నీ ఓమి”.. అంటూ ఇమ్రాన్ హష్మి ఓజీ బర్త్‌డే విషెస్ చెప్పినట్లు గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు రన్ రాజా రన్, సాహో చిత్రాలతో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుజిత్ సైన్ దర్శకత్వం వహిస్తున్నాడు. జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుండగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.