Raashii Khanna | ఓ వైపు యాక్టర్‌గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుని.. మరోవైపు జనసేన పార్టీ చీఫ్‌గా, ఏపీ డిప్యూటీ సీఎంగా సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణం కొనసాగిస్తున్నారు పవన్ కల్యాణ్. మంగళవారం పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కల్యాణ్‌కు అభిమానులు, ఫాలోవర్లు, కోస్టార్లు పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవన్ కల్యాణ్‌తో తొలిసారి పని చేసే అవకాశం కొట్టేసిన రాశీఖన్నా తన కోస్టార్కు బర్త్ డే విషెస్ తెలియజేసింది.
ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ సందర్భంగా లొకేషన్లో డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కల్యాణ్‌తో సీన్ గురించి డిస్కషన్ చేస్తున్న స్టిల్‌ను షేర్ చేసింది. పవన్ కల్యాణ్ సార్ మీ బలం, క్రమశిక్షణ, చిత్తశుద్ధితో మీ ప్రయాణం మిలియన్ల మందికి స్పూర్తిని అందిస్తూనే ఉంది. ఈ ఏడాది మీరు మరింత ఆయురారోగ్యాలతో ఉండాలని.. మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నానని క్యాప్షన్ పెట్టింది రాశీఖన్నా. ఇప్పుడీ స్టిల్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూనే.. మరోవైపు నెటిజన్ల అటెన్షన్‌ను తనవైపునకు తిప్పుకుంటోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్‌లో నటిస్తుండగా.. రాశీఖన్నాకీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే చాలా క్రితం రిలీజ్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌లో భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ పవన్ కల్యాణ్ స్టైల్ ఆఫ్ మ్యానరిజంతో సాగుతున్న డైలాగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. గబ్బర్ సింగ్ కాంబోలో రాబోయే సినిమా ఎలా ఉండబోతుందో మరోసారి గ్లింప్స్‌తో హింట్ ఇచ్చేశాడు హరీష్ శంకర్.
Gatta Kusthi 2 | ‘మట్టి కుస్తీ’కి సీక్వెల్‌ను ప్రకటించిన విష్ణు విశాల్
Pawan Kalyan | OG ఫస్ట్ టికెట్ వేలం పాట .. అన్ని లక్షలు పలికిందా?
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. స్పెషల్ మ్యాష్అప్ వీడియో వదిలిన గీతా ఆర్ట్స్