Pawan Kalyan Birthday Special Video | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, స్టార్ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదకగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ స్పెషల్ మ్యాష్అప్ వీడియోను వదిలింది. పవన్ ఇప్పటివరకు చేసిన సినిమాలతో పాటు అతడి ఐకానిక్ సినిమాలలోని డైలాగ్లను, పవన్ పొలిటికల్ కెరీర్ను ఈ వీడియోలో జత చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.