Gatta Kusthi 2 | తమిళ నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘గట్ట కుస్తీ’ (తెలుగులో మట్టి కుస్తీ) స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం 2022లో విడుదలై తమిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సీక్వెల్‌ను ప్రకటించారు మేకర్స్. కథానాయకుడు విష్ణు విశాల్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకి ‘గట్ట కుస్తీ 2’ అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ వీడియోను చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది.
‘గట్ట కుస్తీ’ సినిమాకు దర్శకత్వం వహించిన చెల్లా అయ్యావు ఈ సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహించబోతుండగా.. మొదటి భాగంలో నటించిన విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ ఈ సీక్వెల్లో కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే, కరుణాస్, మునీష్కాంత్, కాళీ వెంకట్ వంటి నటులు కూడా ఇందులో కొనసాగనున్నారు. విష్ణు విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ ‘విష్ణు విశాల్ స్టూడియోస్’తో పాటు ‘వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్’తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.