puvvada Ajay Kumar | బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగం మాజీ అధ్యక్షుడు తాజుద్దీన్ అకాల మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఖమ్మం నగరంలో తాజుద్దీన్ పార్థివదేహాన్ని పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా తాజుద్దీన్తో తనకున్న అనుబంధాన్ని, పార్టీకి, మైనారిటీ వర్గాల కోసం ఆయన అందించిన సేవలను పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు చేసుకున్నారు. తాజుద్దీన్ మృతి పార్టీకి, మైనారిటీ వర్గాలకు తీరని లోటని, ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరని అన్నారు. తాజుద్దీన్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు.

East Coast | పదో తరగతి అర్హత.. పదిహేను వందలకుపైగా పోస్టులు
Konda Surekha | కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసు.. జూబ్లీహిల్స్ సీఐ సస్పెన్షన్..!