Bihar | విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ.. బిహార్‌లో ఉద్రిక్తం
Bihar | బిహార్‌లో ప్రభుత్వ పరీక్షలు రాసిన అభ్యర్థులు నిరసన చేపట్టారు. పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ సీఎం నివాసం వైపు ర్యాలీ తీశారు. బారికేడ్లను దాటారు. పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించారు.
Bihar | పట్నా: కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్ష రాసిన అభ్యర్థులు, వందల మంది విద్యార్థులు మంగళవారం పట్నాలోని బిహార్ రాష్ట్ర సీఎం సమ్రాట్ చౌధరి నివాసం వైపు ర్యాలీ తీశారు. అడ్డుగా ఉన్న బారికేడ్లను దాటారు. ఈ సందర్భంగా 70వ బీపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. వాటర్ క్యానన్లను ప్రయోగించారు. అయినప్పటికీ వారు సీఎం నివాస సమీపానికి చేరుకున్నారు. భూ సంబంధిత సమస్యలపై రైతు సంఘం నల్ల జెండాలు పట్టుకుని ఈ ఆందోళనలో చేరడంతో సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి.
బీపీఎస్సీ-టీఆర్ఈ 4 ఒకే పరీక్ష, ఉద్యోగ నియమకాల్లో పారదర్శకత, హిందీ మీడియం విద్యార్థులకు బిహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) పరీక్షల్లో సమాన అవకాశాలు కల్పించడం వంటి డిమాండ్లతో విద్యార్థులు, అభ్యర్థులు కొన్ని రోజులుగా పట్నాలోని గార్డనిబాగ్లో ఆందోళన చేపడుతున్నారు. బిహార్ ప్రభుత్వంతో విద్యార్థి ప్రతినిధులు చర్చలు జరిపారు. చర్చలు సానుకూలంగా జరిగాయని విద్యార్థి నాయకుడు సౌరవ్ కుమార్ చెప్పినప్పటికీ తమ అన్ని డిమాండ్ల సాధన కోసం ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు, అభ్యర్థులు నిర్ణయించుకున్నారు. దీంతో సీఎం నివాసం వైపు ర్యాలీ తీయగా పోలీసులు, వారికి మధ్య ఘర్షణ నెలకొంది.

Student Bihar
కింది స్థాయి అధికారులతో చర్చలు జరిపించి తరువాత మా సమస్యను మరిచిపోతున్నారు. కాబట్టి బిహార్ సీఎం లేదా డిప్యూటీ సీఎంతో చర్చలకు అవకాశం కల్పించి, సమస్యలపై అధికార ప్రకటన చేస్తేనే మా నిరసన విరమిస్తామని విద్యార్థి నాయకుడు ఒకరు వెల్లడించారు. సీఎంను కలిసేందుకు అనుమతించాలన్నదే మా ప్రధాన డిమాడ్, విద్యాశాఖ మంత్రి కలిసే అవకాశం కల్పించడం అనేది రెండో ప్రత్యామ్నాయం. అంతే తప్ప ఇంకెవ్వరినీ కలవం అని ఆ విద్యార్థి నాయకుడు స్పష్టం చేశారు.
దీనిపై సీఎం సమ్రాట్ చౌధరి స్పందించారు. విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లేలా ప్రతి నెలా నాలుగో మంగళవారం విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తామని అన్నారు. నేటి నుంచి ప్రభుత్వం ‘విద్యార్థి సహ్యోగ్ శిబిరం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సీఎం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చవని, ప్రత్యేక పోర్ట్, హెల్ప్ లైన్ నంబర్ 1100 ద్వారా వాటి స్థితిని తెలుసుకోవచ్చని వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Peace Prize: భారత సంతతి మహిళ నవనీతం నావి పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి
Manne Krishank | అనుముల ఫ్యామిలీ కాదు..అనకొండ ఫ్యామిలీ : మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

