Manne Krishank | అనుముల ఫ్యామిలీ కాదు..అనకొండ ఫ్యామిలీ : మన్నె క్రిశాంక్
Manne Krishank | అక్రమ ఆస్తులు సంపాదిస్తున్న అనుముల రేవంత్ రెడ్డి ఫ్యామిలీ రాష్ట్రంలో అనకొండ ఫ్యామిలీగా మారిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు.
హైదరాబాద్ : అక్రమ ఆస్తులు సంపాదిస్తున్న అనుముల రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ఫ్యామిలీ రాష్ట్రంలో అనకొండ ఫ్యామిలీగా ( Anaconda family ) మారిందని బీఆర్ఎస్ లీడర్ మన్నె క్రిశాంక్ ( Manne Krishank ) ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రేవంత్ అక్రమ ఆస్తుల ఆర్జనపై మాట్లాడారు.
అక్రమ ఆస్తులపై ఎన్ని ప్రశ్నలు అడిగినా సీఎం , వారి అనుచరుల నుంచి ఎలాంటి స్పందన ఎందుకు రావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవాలు ఉన్నాయనే భయంతో వారు వివరణ ఇవ్వడం లేదని విమర్శించారు. తన క్రిమినల్ బ్రెయిన్‌తో హైదరాబాద్ నగరం మధ్యలోని 817 ఎకరాల భూములను తాకట్టు పెట్టి 12,818 వేల కోట్లకు పైగా రుణం తీసుకున్నారని ఆరోపించారు.
హైటెక్ సిటీ పక్కన ఇజ్జత్ నగర్, మొకిల, మియాపూర్, ఇంజాపూర్, చిలుకూరు, పఠాన్ చెరు, గాజుల రామారం, జవహర్ నగర్ ప్రాంతాల్లోని భూములను తాకట్టు పెట్టారని, రుణం కోసం మార్కెట్ విలువ కేవలం ఎకరాకు 15 కోట్లుగా చూపారు. వాస్తవానికి అక్కడ ఎకరం విలువ 150 కోట్ల కు పైనే ఉంటుందని వెల్లడించారు.
2026 మార్చ్ 31 వరకు హెచ్ఎండీఏ ఖాతాలో 275 కోట్లు ఉంటే, జూన్ నెలాఖరు వరకు 10వేల కోట్లు డిపాజిట్ అయ్యాయని పేర్కొన్నారు. కనీసం 40 నుంచి 80 వేల కోట్లు ఉండాల్సిన భూముల విలువ 12 వేల కోట్లు మాత్రమే చూపారని వెల్లడించారు. జవహర్ నగర్ లో తాకట్టు పెట్టిన భూమిని 2008లో జెన్ పాక్ట్ సంస్థకు కేటాయించారని తెలిపారు. ఆ భూమిలో కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రా కంటెయినర్లు పెడుతున్నారు . ఓ వైపు తాకట్టు పెట్టిన భూమిలోనే కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రా మనుషులు కంటెయినర్లు ఎలా పెడతారని ప్రశ్నించారు.
తాను వ్యక్తిగత ఆస్తుల గురించి మాట్లాడడం లేదని, తెలంగాణ సంపద గురించి ప్రశ్నిస్తు న్నామని తెలిపారు. దోపిడీ, అవినీతి గురించి ఎన్ని సార్లు, ఎంత మంది అడిగినా సమాధానం చెప్పకుండా బెదిరింపులకు పాల్పడుతూ, అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇటీవల రేవంత్ కుటుంబసభ్యులు 52 వేల కోట్ల అక్రమ ఆస్తులు కూడ బెట్టుకున్నారని ఆధారాలతో చెప్పాం. ఈరోజు కే ఎల్ ఎస్ఆర్ ఎపిసోడ్లో ఆ ఆస్తులు మరింత పెరిగాయని అన్నారు.
కేటీఆర్, హరీష్‌రావుపై వస్తున్న ఆరోపణలకు వాళ్లే స్వయాన వివరణ ఇస్తుంటే, ఏ స్థాయి లేని రేవంత్ కుటుంబ సభ్యులు ఎందుకు మాట్లాడటం లేదని ఆరోపించారు. తన ఆరోపణలకు సమాధానం లేక కొందరు భౌతిక దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు. అయినా తెలంగాణ సంపద కాపాడటానికి ఎంతకైనా తెగిస్తామని మన్నె క్రిశాంక్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
MBBS Seat | పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన మాగనూర్ ముద్దుబిడ్డ
Ajmer Jailer | మహిళా ఖైదీలతో ఇంటి పనులు చేయిస్తున్న జైలర్ అరెస్ట్
పూలతో బతుకమ్మ వైభవం- అక్షరాలతో భావితరాల వికాసం
ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై అధికారుల రైడ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

