NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ (IBPC) కువైట్ 2026–2028 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది.
కువైట్ : ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ (IBPC) కువైట్ 2026–2028 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. సాల్మియాలోని హాలిడే ఇన్‌లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం, ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. గౌరవ్ ఒబెరాయ్ చైర్మన్‌గా, సునీత్ అరోరా సెక్రటరీగా, సురేష్ కె.పి. వైస్ చైర్మన్‌గా, కృష్ణన్ సూర్యకాంత్ జాయింట్ సెక్రటరీగా, రామదాస్ కార్తీక్ కోశాధికారిగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా చైర్మన్ గౌరవ్ ఒబెరాయ్ మాట్లాడుతూ భారత్–కువైట్ మధ్య వ్యాపార, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు సభ్యులకు కొత్త వ్యాపార అవకాశాలు, నెట్వర్కింగ్ వేదికలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భారత రాయబార కార్యాలయం, కువైట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, భారతీయ పారిశ్రామిక సంస్థలు, అంతర్జాతీయ బిజినెస్ కౌన్సిళ్లతో భాగస్వామ్యాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు.
మాజీ చైర్మన్ డాక్టర్ కైజర్ టి. షకీర్, మాజీ చైర్మన్లు ధీరజ్ ఒబెరాయ్, టోనీ జష్నమల్, ఎస్.కె. వాధ్వాన్, శివీ భాసిన్‌లు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులు ఐబీపీసీలో మరింత చురుకుగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సునీత్ అరోరా వ్యాఖ్యాతగా వ్యవహరించి, చివర్లో వందన సమర్పణ చేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

