Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Vijay Deverakonda | టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, టాలెంటెడ్ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్గా దర్శకుడు రాహుల్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక హిస్టారికల్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’.
Vijay Deverakonda | టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, టాలెంటెడ్ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్గా దర్శకుడు రాహుల్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక హిస్టారికల్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’. ఈ సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచేసింది. అయితే, ఈ ట్రైలర్‌తో పాటు గతంలో విడుదలైన టీజర్లో కనిపించిన ఒక ప్రత్యేకమైన పాత్ర ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
శింగనమల కొండపై ఉన్న ఒక గుహలో చూపించిన భారీ కాయం కలిగిన ఆ పాత్ర ఎవరిదనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో విపరీతంగా పెరిగింది. మొదట ఈ పాత్రను కూడా హీరో విజయ్ దేవరకొండనే విభిన్న గెటప్‌లో చేస్తున్నాడని అంతా భావించారు. కానీ, లేటెస్ట్గా వచ్చిన ట్రైలర్‌ను పరిశీలిస్తే అది విజయ్ కాదు వేరే నటుడు అని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆ పాత్ర చేసింది ఓ ప్రముఖ నటుడేనని, ఆ విషయాన్ని ఆడియెన్స్‌కే వదిలేస్తున్నామని సస్పెన్స్ క్రియేట్ చేశారు.
ట్రైలర్లో ఆ భారీ మనిషి రూపం, బాడీ లాంగ్వేజ్‌ను గమనిస్తే.. ‘పందెం కోడి’, ‘సాహో’, ఇటీవల పవన్ కళ్యాణ్ ‘OG’ చిత్రంలో కీలక పాత్రల్లో అలరించిన ప్రముఖ మలయాళ సీనియర్ నటుడు లాల్ లాగే ఉన్నారని నెటిజన్లు బలంగా చర్చిస్తున్నారు. ముఖానికి వేసిన హెవీ ప్రొస్థెటిక్ మేకప్ కారణంగా మొదట గుర్తుపట్టడం కష్టమైనప్పటికీ, ‘భద్రమల్లన్న’గా కనిపిస్తున్న ఆ పాత్రను లాల్ పోషించి ఉంటారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంచనాలు ఎంతవరకు నిజమనేది సినిమా విడుదలయ్యే ఈ నెల 16న తేలనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

