Nobel Peace Prize: భారత సంతతి మహిళ నవనీతం నావి పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి
Nobel Peace Prize: భారత సంతతి మహిళ నవనీతం నావి పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. నార్వేయన్ నోబెల్ కమిటీ ఇవాళ ఆ అవార్డును ప్రకటించింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో సెటిల్ అయిన తమిళ కుటుంబంలో ఆమె జన్మించారు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. యుద్ధ నేరాల్లో నిందితులకు శిక్ష పడేలా చేశారు. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల హై కమీషనర్‌గా చేశారామె. నెల్సన్ మండేలాకు మద్దుతగా నిలిచారు.
ఓస్లో: భారత సంతతి మహిళకు 2026 నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ యేటి నోబెల్ శాంతి బహుమతిని నవనీతం నావిపిళ్లై ( Navanethem Navi Pillay) గెలుచుకున్నారు. ఓస్లోలోని నార్వేయన్ నోబెల్ కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. శాంతి, అంతర్జాతీయ న్యాయ స్థాపన కోసం ఆమె తీవ్రంగా కృషి చేసినట్లు నోబెల్ కమిటీ తన ప్రకటనలో పేర్కొన్నది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమితి హై కమీషనర్‌గా 2008లో నావి పిళ్లై నియమితులయ్యారు. 2008, సెప్టెంబర్ ఒకటో తేదీన ఆమె ఆ పోస్టును స్వీకరించారు. సమగ్రమైన ప్రపంచ న్యాయం కోసం ఆమె పోరాటం చేశారు. యుద్ధ నేరాలు, మానవాళిపై నేరాలు, ఊచకోత లాంటి కేసుల్లో కచ్చితంగా ప్రాసిక్యూషన్ అమలు చేశారు.
దక్షిణాఫ్రికాకు చెందిన పిళ్లై.. 1967లో తన స్వంత ప్రావిన్సు నాటల్‌లో ఆమె లా ప్రాక్టీస్ చేశారు. సామాజిక కార్యకర్తలకు గతంలో ఆమె డిఫెన్స్ అటార్నీగా చేశారు. రాబెన్ ఐలాండ్‌లో ఉన్న ఖైదీల హక్కుల కోసం ఆమె పోరాడారు. డర్బన్‌లో ఉన్న భారతీయ తమిళ కుటుంబంలో ఆమె జన్మించారు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా ఆమె లీగల్‌గా వాదించారు. నెల్సన్ మండేలాకు ఆమె సపోర్టు ఇచ్చారు.
Newly awarded peace laureate Navi Pillay has held states and national leaders accountable and brought hope to victims of violence and conflict.
Navi Pillay is one of the great defenders of international legal principles in our time. Her distinguished career reminds us of the need to support, fortify and expand the global rule of law. Navi Pillay’s commitment to justice and human dignity is a source of hope and inspiration to all who seek to bring about a more peaceful world.
Read more about the 2026 #NobelPeacePrize: https://t.co/JMjpp1jPKc
#NobelPrize
— The Nobel Prize (@NobelPrize) October 9, 2026
దక్షిణాఫ్రికాలోని నాటల్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారామె. న్యాయ పట్టాలో మాస్టర్స్‌తో పాటు హార్వర్డ్ వర్సిటీ నుంచి జురిడికల్ సైన్స్‌లో డాక్టరేట్ చేశారు. 1941లో నవనీతం పుట్టారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈక్వాలిటీ నౌ అనే అంతర్జాతీయ మహిళా హక్కుల సంస్థను ఆమె స్థాపించారు. క్వాజులు నాటల్ వర్సిటీలో లెక్చరర్‌గా చేశారు. డర్బర్ వెస్ట్విల్లే వర్సిటీలి వైస్‌ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 1995లో దక్షిణాఫ్రికా హైకోర్టులో తాత్కాలిక జడ్జడీగా చేశారు. ఆ ఏడాదిలోనే యూఎన్ జనరల్ అసెంబ్లీకి అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్‌కు జడ్జీగా ఎన్నికయ్యారు. రువాండాలో 8 ఏళ్లు చేశారు. రేప్, భావస్వేచ్ఛ కేసుల్లో వాదించారు. 2003లో హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు జడ్జీగా ఆమె నియమితులయ్యారు.
ఓస్లోలోని నార్వేయన్ నోబెల్ కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం 287 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్లో కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. నోబెల్ పీజ్ ప్రైజ్ నేటితో 125 వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇప్పటి వరకు 112 మంది వ్యక్తులకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ అవార్డును అందుకున్న వారిలో 28 సంస్థలు కూడా ఉన్నాయి. రెడ్ క్రాస్ మూడు సార్లు, యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ రెండు సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ గెలుచుకున్నాయి. 112 మంది వ్యక్తుల్లో 20 మంది మహిళలు ఉన్నారు. అయితే గత 15 ఏళ్లలోనే సుమారు 8 మంది మహిళలు నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. పీస్ ప్రైజ్ అందుకున్న అతిపిన్న వయస్కురాలిగా మలాలా యూసుఫ్‌జాయి నిలుస్తుంది. ఆమె 17 ఏళ్ల వయసులో 2014లో ఆ అవార్డు స్వీకరించింది.
అమెరికా అత్యధికంగా 24 నోబెల్ శాంతి పురస్కారాలను అందుకున్నది. యూకే 13, స్విట్జర్లాండ్ 11 అవార్డులతో తర్వాత స్థానాల్లో నిలిచాయి. 19 సందర్భాల్లో నోబెల్ పీస్ ప్రైజ్‌ను ఇవ్వలేదు. 1948లో మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు. ఆ సంవత్సరం పీస్ ప్రైజ్ ప్రకటించలేదు. 12 సార్లు గాంధీ .. శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. కానీ ఆయనకు ఆ అవార్డు దక్కలేదు. 1939లో స్వీడన్ పార్లమెంట్ ఆ అవార్డును అడాల్ఫ్ హిట్లర్‌కు ఇవ్వాలని నామినేషన్ వేసింది. కానీ ఆ తర్వాత ఆ నామినేషన్ వెనక్కి తీసుకున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
MBBS Seat | పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన మాగనూర్ ముద్దుబిడ్డ
Ajmer Jailer | మహిళా ఖైదీలను జైలు నుంచి తీసుకెళ్లి ఇంటి శుభ్రం.. జైలర్ అరెస్ట్
పూలతో బతుకమ్మ వైభవం- అక్షరాలతో భావితరాల వికాసం
ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై అధికారుల రైడ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

