న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహన విక్రయాలకు ఆదరణ తగ్గుతున్నది. గడిచిన నెలలో అమ్మకాలు 2.5 శాతం తగ్గి 3,41,510 యూనిట్లకు పడిపోయాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) తన నెలవారి నివేదికలో వెల్లడించింది. అధిక బేస్ రేటు కారణంగా అమ్మకాలు తగ్గాయని పేర్కొంది. జూలై 2023లో 3,50,355 యూనిట్లు అమ్ముడయ్యాయి.