Train | ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైల్లో (Train) ఓ ప్రయాణికుడిపై కొందరు కర్రలతో దాడి చేశారు (Passenger beaten with sticks). ఈ ఘటన ఝాన్సీ (Jhansi)లో చోటు చేసుకుంది.
నిహాల్ అనే వ్యక్తి ఇటీవలే తన కుటుంబంతో కలిసి కత్రా నుండి బినాకు అండమాన్ ఎక్స్ప్రెస్ (Andaman Express) రైలులో ప్రయాణించాడు. ఈ క్రమంలో రైల్లో భోజనం తీసుకున్నాడు. అయితే, రూ.110గా ఉన్న వెజ్ మీల్స్ (vegetarian meal)కు రూ.130 వసూలు చేయడంపై నిహాల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ధర చాలా ఎక్కువ అని క్యాటరింగ్ సిబ్బందితో వాదించాడు. ఆగ్రహించిన సిబ్బంది నిహాల్పై దాడికి ప్రయత్నించారు. కొంతమంది కర్రలు, బెల్టులతో తీవ్రంగా కొట్టారు. తోటి ప్రయాణికులు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Passenger thrashed on Andaman Express at Jhansi station for refusing ₹130 for ₹110 thali. @/IRCTCofficial turning trains into mafia turf via catering vendors—assaults now routine.
pic.twitter.com/MEJ2jSHttK— Ghar Ke Kalesh (@gharkekalesh) November 5, 2025
Also Read..
Shilpa Shetty | రూ.60 కోట్ల మోసం కేసు.. నిధులు మళ్లించిన వ్యక్తుల్ని గుర్తించిన దర్యాప్తు బృందం
Bihar Elections | ఓటేసిన ప్రముఖులు.. 9 గంటల వరకూ పోలింగ్ శాతం ఎంతంటే..?