న్యూఢిల్లీ: హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బ్రెజిల్ మోడల్(Brazilian Model) ఓటేసినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ మోడల్ పేరుతో 22 ఓట్లు ఉన్నాయని ఆయన బుధవారం మీడియా ముందు ఆరోపించారు. అయితే ఆ మోడల్ ఎవరన్నది తెలిసింది. ఆమెను లారిసా నేరిగా గుర్తించారు. ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో రాహుల్ గాంధీ వాడిన తన ఫోటో గురించి ఆ మోడల్ స్పందించింది. తాను 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ ఫోటో దిగినట్లు ఆమె చెప్పింది. ఆ మోడల్ దీనిపై ఓ వీడియోను కూడా రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.
తనకు చెందిన ఓ పాత ఫోటోను వాడారని, 20 ఏళ్ల వయసులో ఆ ఫోటో దిగానని, ఇండియాలో ఓటింగ్ కోసం వాడినట్లు తెలిసిందని, ప్రజల్ని మోసం చేసేందుకు తనను ఇండియన్‌గా చూపిస్తున్నారని, ఇదేం వెర్రితనం, ఇంత పిచ్చా, మనం ఏం ప్రపంచంలో జీవిస్తున్నాని ఆ మహిళ తన వీడియోలో పేర్కొన్నది. తన ఫోటో మీడియాలో రాగానే తనతో మాట్లాడేందుకు ఓ జర్నలిస్టు ప్రయత్నించినట్లు ఆమె చెప్పింది. ఓ ఫ్రెండ్ కూడా తనతో ఈ అంశంపై మాట్లాడేందుకు ఆసక్తి చూపినట్లు పేర్కొన్నది. మోడల్ లారిసా నేరి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఓ పోస్టు పెట్టింది. ఇది చాలా క్రేజీగా ఉందని, తాను ఇండియాలో ఫేమస్ అయ్యానని, ఓ అదృశ్య బ్రెజిల్ మోడల్‌గా ఫేమస్ అయినట్లు ఆమె పేర్కొన్నది.
వాస్తవానికి లారిసా మోడల్ కాదు. ఆమె సాధారణ మహిళే అని తెలుస్తోంది. హెయిర్‌డ్రెస్సర్‌గా పనిచేస్తున్నది. ఓ ఫ్రెండ్ కోసం ఫోటో దిగితే దాన్ని ఆన్లైన్లో అందరూ వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో లారిసా లాంటి ఫేక్ ఓట్లతో బీజేపీ గెలిచినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు.
The name of the Brazilian Model seen in @RahulGandhi‘s press conference is Larissa. Here’s her reaction after her old photograph went viral. pic.twitter.com/K4xSibA2OP
— Mohammed Zubair (@zoo_bear) November 5, 2025