– రైతుబంధు సమితి నాంపల్లి మండల మాజీ కన్వీనర్ రవీందర్ రెడ్డి
నాంపల్లి, సెప్టెంబర్ 28 : బీఆర్ఎస్ అభివృద్ధి కోసం పని చేసిన ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని రైతుబంధు సమితి నాంపల్లి మండల మాజీ కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని దామెర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువజన నాయకులు బొట్టు జగన్ తల్లి బొట్టు లక్ష్మమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రూ.10,000 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు వట్టికోటి నరేశ్, పోషం నరేశ్, బొట్టు జగన్, నక్క శ్రీనివాసులు ఉన్నారు.