Nellore | కోడలను కాపాడబోయి అత్తామామలు మృతి.. నెల్లూరు జిల్లాలో ఘటన
కోడలను కాపాడబోయి అత్తామామలు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన సైదాపురం మండలం చాగణం రాజుపాలెంలో చోటు చేసుకుంది.
అమరావతి : ఏపీలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోడలను కాపాడబోయి అత్తామామలు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన సైదాపురం మండలం చాగణం రాజుపాలెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివారాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఇండ్ల రవి(57), సునీత (50) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. కూలీ పనులు చేసుకుంటు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
కాగా, పెద్ద కుమారుడి భార్య చెంచమ్మ ఉతికిన బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో కిందపడి పోయింది. గమనించిన అత్తామామలు చెంచమ్మను కాపాడే ప్రయత్నంలో ఇనుప తీగను తొగను తొలగించే క్రమంలో కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందారు. కోడలుకు స్వల్ప గాయాలయ్యాయి. సమాఆరం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

