ఎల్లారెడ్డి రూరల్ : మీకు అండగా మేముంటాం. ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడానికి కవాతు నిర్వహిస్తున్నామని సీఐ రవీందర్ నాయక్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (Rapid Action Force) బలగాలతో కవాతు (Parade) నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన కవాతు శివాజీ చౌక్, వైశ్య భవన్, డైలీ మార్కెట్, గాంధీ చౌక్, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా వరకు కవాతు నిర్వహించారు.
పట్టణంలో ఎటువంటి అల్లర్లు సృష్టించినా, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో మత ఘర్షణలు, శాంతి భద్రతల సమస్యలు వస్తే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను అదుపు చేయడంలో స్థానిక పోలీసులకు రాపిడ్ బలగాలు సహకరిస్తారన్నారు. కవాతులో ఎస్ఐ బొజ్జ మహేష్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు, పోలీసులు పాల్గొన్నారు.