సిద్దిపేట : విద్యుత్ షాక్తో (Electric Shock ) గ్రామపంచాయతీ కార్మికుడి (Panchayat worker ) మృతి
చెందిన ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఏర్పాట్ల పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్రామపంచాయతీ కార్మికుడు ఎండీ మోహిన్ పాషా (32) మృతి చెందాడు.
జాతీయ జెండా ఆవిష్కరణ కోసం విధి నిర్వహణలో భాగంగా జెండా పైపును శుభ్రం చేస్తుండగా పైపు ప్రమాద వశాత్తూ విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుత్ షాక్కు గురై మోహిన్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.