అమరావతి : అమలాపురం జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ వైసీపీ నేతల వేధింపులను భరించలేక గిరిజన ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. జగన్ అండతో వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు. బలవన్మరణానికి కారకులైన వైసీపీ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
సుధాకర్ నుంచి భవనీ వరకూ ప్రభుత్వ ఉద్యోగుల మరణాలన్నీ వైసీపీ చేసిన హత్యలేనని మండిపడ్డారు. ఈ హత్యలను తప్పుదారి పట్టిస్తూ, నిందితులైన వైసీపీ నేతలని కాపాడుతున్న పోలీసులు, అధికారులకు కూడా జగన్ రెడ్డి క్రూర పాలనలో ఇదే గతి పట్టొచ్చని చెప్పారు. వైసీపీ బాధితులైన సాటి ఉద్యోగులకి అండగా నిలవాలని ఉద్యోగులను ఆయన కోరారు.