సిద్దిపేట : బాధితుడి ప్లాట్‌లో నుంచి వెళ్తున్న డైనేజీ పైప్‌లైన్ ( Drainage Pipeline ) ను తొలగించేందుకు లంచం తీసుకున్న పంచాయతీ కార్యదర్శి ( Secretary ) ని ఏసీబీ ( ACB ) అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజాగౌడ్ రూ.10 వేలు తీసుకుంటూ పట్టుబడ్డారు. మధ్యవర్తిగా ఉన్న సర్పంచ్ భర్త గొల్లపల్లి ఆంజనేయులును సైతం పట్టుకుని కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి హైదరాబాద్ కోర్టులో హాజరుపరిచామని ఏసీబీ అధికారులు వివరించారు.