న్యూయార్క్: అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి చెందిన విల్సన్ కాలేజ్ ఆఫ్ టెక్స్టైల్స్ విద్యార్థులను భారతీయ సంతతి వ్యక్తి సర్ప్రైజ్ చేశారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న 176 మంది గ్రాడ్యుయేట్ విద్యార్థుల రుణాలు చెల్లించనున్నట్లు ప్రకటించారు. రలేగ్లోని రేనాల్డ్స్ కొలేషియంలో గ్రాడ్యుయేషన్ సెర్మనీ జరిగింది. ఈ ఘటనపై న్యూయార్క్ పోస్టు ఓ కథనాన్ని రాసింది. భారతీయ వ్యక్తి అనిల్ కొచ్చార్( Anil Kochhar) తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన తండ్రి ప్రకాశ్ చాంద్ కొచ్చార్ జ్ఞాపకంగా విద్యార్థుల రుణాలను చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. పంజాబ్‌కు చెందిన తన తండ్రి.. రలేగ్కు వలస వచ్చినట్లు ఆయన ఆ సెర్మనీలో మాట్లాడుతూ వెల్లించారు. విల్సన్ కాలేజీలో ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులందరికీ గిఫ్ట్ ఇస్తున్నానని, 2025-26 అకాడమిక్ సంవత్సరానికి చెందిన విద్యార్థుల ఫీజులను చెల్లించనున్నట్లు చరెప్పారు. మారిలిన్ తాను కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని, స్వేచ్ఛగా మీరు మీ డిగ్రీని పొందాలని, మీ లక్ష్యాలను మీరు చేరుకోవాలని, దేని కోసం కష్టపడ్డారో ఆ జీవితాన్ని నిర్మించుకోవాలని అనిల్ తన ప్రసంగంలో తెలిపారు.
80 ఏళ్ల క్రితం ప్రకాశ్ చాంద్కొచ్చా .. పంజాబ్ నుంచి అమెరికా వెళ్లారు. 1946లో ఎన్సీ రాష్ట్రంలో అతను టెక్స్టైల్ మాన్యుఫ్యాక్చరింగ్ విద్యను అభ్యసించారు. 1950లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. 1952లో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యూయార్క్ సిటీలోని రేయాన్ ఇండస్ట్రీలో సర్వీస్ కోఆర్డినేటర్‌గా పని చేశారు. 1985లో ఆయన మరణించారు. విల్సన్ కాలేజ్ ఆఫ్ టెక్స్టైల్స్ కాలేజీ ఒక్కటే అమెరికాలో వస్త్ర రంగ విద్యకు అంకితమైంది. కొచ్చార్ కుటుంబం మూడు తరాల నుంచి ఆ రంగంలోనే పనిచేస్తున్నది. తన తండ్రి ఆ చదువుతో టెక్స్టైల్ రంగంలో ఉన్నత దశకు చేరుకున్నట్లు అనిల్ కొచ్చార్ తెలిపారు.