జోగులాంబ, గద్వాల : జిల్లాలోని అయిజా మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి బోయ రాజన్న ( Secretary Rajanna ) లంచం తీసుకుంటు అవినీతి నిరోదక శాఖ ( ACB ) అధికారులకు పడ్డుబడ్డాడు. ఇందిరమ్మ ఇంటి ( Indiramma House ) నిర్మాణంలో భాగంగా నాలుగు విడతలుగా మంజూరయ్యే నిధుల కోసం కార్యదర్శి ప్రతి బిల్లుకు రూ.5 వేలు చొప్పున డిమాండ్ చేశాడు.
మొత్తం రూ. 20 వేలకు గాను రూ.15 వేలు ఒప్పందం కుదుర్చుకుని శుక్రవారం ఎంపీడీవో కార్యలయ ఆవరణలో రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డాడని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. కార్యదర్శి రాజన్నను అరెస్టు చేసి హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు.