తిమ్మాజీపేట : మండల కేంద్రంలో గురువారం పంచాయతీరాజ్ దినోత్సవం (Panchayat Raj Day ) నిర్వహించారు. స్థానిక గ్రామ పంచాయితీ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. గ్రామపంచాయతీలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, మరుగుదొడ్లు నిర్మించుకుంటామని, హరితహారంలో (Haritha Haram) భాగంగా ఆరు మొక్కలు నాటి సంరక్షించుకుంటామని, ఇంటితోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పంచాయతీ అధికారి రామ్మోహన్ రావు మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం, పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీదేవి, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, స్థానికులు పాల్గొన్నారు.