నారాయణ పేట : జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్ ( Polling ) 84.33 శాతం నమోదు అయింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. రెండో విడత లో దామరగిద్ద, నారాయణ పేట ( Narayanapet ), ధన్వాడ, మరికల్ మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీ ల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు.
నాలుగు మండలాల్లో కలిపి మొత్తం 1,50,318 ఓట్లు ఉండగా మొత్తం 1,26,769ఓట్లు పోల్ అయ్యాయి. పూర్తిగా పోలింగ్ ముగిసిన తర్వాత 84.33 శాతంగా నమోదు అయింది.రెండో విడత పోలింగ్లో నాలుగు మండలాల్లో మొత్తం 76,642 మంది మహిళా ఓటర్లకు గాను 64,065మంది , 73 ,674మంది పురుష ఓటర్లకు గాను 62,703 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాలుగు మండలాలలో అత్యధికంగా దామరగిద్ద మండలంలో 85.21 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా ధన్వాడ మండలంలో 82.14 శాతం పోలింగ్ నమోదు అయింది.
మండలాల వారిగా ఓటర్లు.. నమోదు అయిన పోలింగ్ శాతం
దామరగిద్ద మండలంలో మొత్తం ఓటర్లు 39,812 మంది ఓటర్లు ఉండగా, 33,925 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మండలంలో మొత్తం 85.12 శాతం పోలింగ్ నమోదు అయింది.ధన్వాడ మండలంలో మొత్తం ఓటర్లు 30,019 మంది ఉండగా, 24,659 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మండలంలో 82.14 శాతం పోలింగ్ నమోదు అయింది.
మరికల్ మండలంలో మొత్తం 33, 444 మంది ఓటర్లు ఉండగా, 28,381మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మండలంలో 84. 86శాతం పోలింగ్ నమోదు అయింది. నారాయణ పేట మండలంలో మొత్తం ఓటర్లు 47043 మంది ఉండగా వారిలో 39,804మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.