దేవరకొండ రూరల్, సెప్టెంబర్ 30 : దేవరకొండ మండలం పడమటిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పల్లా శ్రీనివాస్ రెడ్డి తండ్రి పల్లా జంగారెడ్డి మృతి బాధాకరమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం పడమటిపల్లి గ్రామంలో పల్లా జంగారెడ్డి మృతదేహానికి రమావత్ రవీంద్ర కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, స్థానిక సర్పంచ్ పల్లా శ్రీకాంత్ రెడ్డి, రామస్వామి, యాదయ్య ఉన్నారు.