ఇంగ్లండ్ 657.. పాక్ 181/0
రావల్పిండి: పరుగుల వరద పారుతున్న టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్ దీటుగా బదులిస్తున్నది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (89 బ్యాటింగ్), ఇమామ్ (90 బ్యాటింగ్) రాణించడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి పోరులో పాకిస్థాన్ వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 506/4తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. 657 పరుగుల వద్ద ఆలౌటైంది. పాక్‌పై ఇంగ్లండ్‌కు ఇదే అత్యధిక స్కోరు. హ్యారీ బ్రూక్స్ (153; 19 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ సెంచరీ నమోదు చేసుకోగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (41), జాక్స్ (30), రాబిన్సన్ (37) తలా కొన్ని పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో జాహిద్ 4, నసీమ్ షా మూడు వికెట్లు పడగొట్టారు.