Pakistan : సౌదీ అరేబియాపై హౌతీ ఉగ్రవాద సంస్థ దాడులకు దిగింది. దీంతో తమ మిత్ర దేశం, తాజా మక్కా కూటమిలో సభ్య దేశమైన సౌదీపై జరుగుతున్న ఈ దాడిని పాకిస్తాన్ ఖండించింది. ఈ దాడులు ఇలాగే కొనసాగితే తాము కూడా దాడి చేస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా యుద్ధం తీవ్రతరమవుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్, అమెరికా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఇరాన్‌కు మద్దతుగా యెమెన్‌కు చెందిన ఉగ్రసంస్థ హౌతీ.. సౌదీ అరేబియాపై దాడి చేస్తోంది.
ఇతర గల్ఫ్ దేశాలపై కూడా దాడికి దిగుతోంది. దీంతో ఈ దాడులపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే.. ఇటీవలే పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా కలిసి మక్కాలో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ మూడు దేశాలు కలిసి సైనిక, రక్షణ పరమైన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఈ మూడు దేశాల్లోని ఏ దేశంపై దాడి జరిగినా అది తమ అందరిపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని ఇటీవల ఒప్పందం సందర్భంగా ప్రకటించాయి. కూటమిలోని ఒక దేశానికి మద్దతుగా, మిగతా దేశాలు కూడా దాడి చేస్తామని ప్రకటించాయి.
ఈ ఒప్పందం ప్రకారం.. ప్రస్తుతం సౌదీపై ఇరాన్ మద్దతుదారులైన హౌతీలు దాడి చేస్తుండటంతో పాకిస్తాన్ ఖండిస్తోంది. సౌదీ అరేబియాపై హౌతీలు జరుపుతున్న దాడుల్ని ఆపాలని హెచ్చరించింది. లేకుంటే, సౌదీకి మద్దతుగా పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందని తెలిపింది. ఇదే సమయంలో ఇరాన్‌కు కీలక సూచన చేసింది. హౌతీలు సౌదీ అరేబియాపై దాడికి దిగకుండా చూడాల్సిన బాధ్యత ఇరాన్‌దేనని తేల్చిచెప్పింది. ఇందుకోసం ఇరాన్ తమ అధికారాన్ని, దౌత్యాన్ని ఉపయోగించాలని సూచించింది.
లేకుంటే తమ కూటమి (పాక్, టర్కీ, సౌదీ) కలిసి దాడులు చేస్తామని పాక్ వెల్లడించింది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని పాక్ తేల్చిచెప్పింది. ఇక, సౌదీపై హౌతీలు జరిపిన దాడుల్లో 73 మందికి గాయాలయ్యాయి. మరోవైపు సౌదీ కూడా హౌతీలు ఉన్న యెమెన్‌పై దాడికి దిగుతోంది.