ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు.
మెదక్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు. సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మెదక్ జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకృతిని ఆరాధించే గొప్ప సంప్రదాయం
పూలను దేవతగా కొలిచే గొప్ప సంప్రదాయం తెలంగాణ సొంతమని పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడపడుచులంతా ఒకచోట చేరి ఆటపాటలతో పండుగను జరుపుకోవడం తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకతగా నిలుస్తుందన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలు, చెట్లు, పర్యావరణాన్ని ప్రేమించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలదని తెలిపారు. బతుకమ్మ పండుగ ప్రకృతి ప్రేమకు, మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో బతుకమ్మకు విశేష ప్రాధాన్యం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగకు విశేష ప్రాధాన్యతనిచ్చారని ఆమె గుర్తుచేశారు. పండుగను అధికారికంగా నిర్వహించడంతో పాటు, ఏటా ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని భావితరాలకు అందించేలా ప్రజలందరూ బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో, సంతోషంగా జరుపుకోవాలని పద్మా దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

