Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
పంట చేతికి వస్తుందన్న ఆశతో లక్షల రూపాయలు అప్పులు చేసి సాగు చేస్తున్న రైతులకు సాగునీటి కొరత శాపంగా మారుతోంది.
జోగుళాంబ గద్వాల : పంట చేతికి వస్తుందన్న ఆశతో లక్షల రూపాయలు అప్పులు చేసి సాగు చేస్తున్న రైతులకు సాగునీటి కొరత శాపంగా మారుతోంది. భూగర్భ జలాలు అడుగంటడం, బోర్లలో నీరు తగ్గిపోవడం, ఎండ తీవ్రతతో పంటలు ఎండిపోతుండటంతో రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పొలాలకు తరలిస్తున్నారు. అయినా పంటలకు సరిపడా నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలోని తుపత్రాల గ్రామంలో పలువురు రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వేల రూపాయలు ఖర్చు చేస్తూ ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి, అర్ధరాత్రి వేళల్లోనూ ట్రాక్టర్లతో పొలాలకు తరలిస్తున్నారు. దీనికి ఉదాహరణగా గ్రామానికి చెందిన రైతులు వెంకటన్న, వీరేష్ నిలుస్తున్నారు.
మిరప పంటకు నీరు అందకపోవడంతో ఇటీవల మూడు కొత్త బోర్లు వేయించినా నీరు లభించలేదు. ప్రస్తుతం రోజుకు సుమారు పది ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తూ పంటను కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. కాగా, గ్రామంలోనే కాకుండా మండలంలోని పలు ప్రాంతాల్లోనూ రైతులు బోర్లు విఫలమై పెట్టుబడులు నష్టపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాగు ఖర్చులకు తోడు నీటి కొనుగోలు భారంగా మారడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వేసవిని తలపించేలా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ, భూగర్భ జలాల శాఖ అధికారులు ఇప్పటి నుంచే రైతులకు నీటి లభ్యతపై అవగాహన కల్పించాలి.
బోర్లు వేయడానికి ముందు భూగర్భ జలాల పరిస్థితిని అంచనా వేసేలా మార్గనిర్దేశం చేయాలి.. బోర్లు విఫలమై నష్టపోయిన రైతులకు వర్తించే ప్రభుత్వ పథకాలు, రాయితీలు, ఆర్థిక సహాయంపై స్పష్టమైన సమాచారం అందించాలి. సాగునీటి కొరతను ఎదుర్కొంటున్న రైతులకు అవసరమైన సహకారం అందించి, వారి పెట్టుబడులు వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

