Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident )చోటు చేసుకుంది. భక్తులపైకి( Devotees) ట్రక్కు(truck) దూసుకెళ్లడంతో 12 మంది దుర్మరణం చెందారు.
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident )చోటు చేసుకుంది. భక్తులపైకి( Devotees) ట్రక్కు(truck) దూసుకెళ్లడంతో 12 మంది దుర్మరణం చెందారు. 39 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన గ్వాలియర్ జిల్లాలో శీతలా మాత ఆలయం వద్ద శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈప్రమాదంలో భక్తులు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు, గ్వాలియర్ ఎస్పీ ధర్మవీర్ సింగ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో చిన్నిర్ వైపు నుంచి వడ్ల లోడుతో వస్తున్న ఒక వస్తున్న భారీ ట్రక్కు అదుపు తప్పి భక్తులపైకి దూసుకెళ్లడంతో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
ఆ మార్గంలో భారీ వాహనాల ప్రవేశంపై నిషేధం ఉన్నప్పటికీ, లారీ అక్కడున్న పోలీస్ బారికేడ్లను, చెక్పోస్టును బద్దలుకొట్టుకుంటూ వేగంగా దూసుకొచ్చిందని స్థానికులు తెలిపారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న భక్తులను తొక్కుకుంటూ వెళ్లడమే కాకుండా, శీతలా మాత ఆలయ ప్రహరీ గోడను, ప్రధాన గేటును బలంగా ఢీకొట్టింది. దీంతో గోడ కూలి కొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

