Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎంఎంఎస్) కోర్సు పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును ఈ నెల 16వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఢిల్లీకి అందే మూటల మీద ఉన్న శ్రద్ధ.. మీరిచ్చిన మాట మీద లేదా.. రాహుల్‌గాంధీని నిలదీసిన కేటీఆర్
Secretariat | రేపట్నుంచే సచివాలయంలో ‘ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్’ అమలు
Harish Rao | చిదంబరం తెలంగాణ ప్రకటనకు కేసీఆరే కారణం : హరీశ్‌రావు