న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై మన దేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం ఒక కొత్త విషయాన్ని వెల్లడించారు. అందరూ అనుకుంటున్నట్టుగా పాక్‌తో మే 7న ప్రారంభమైన యుద్ధం మే 10న మూడు రోజుల్లో ముగిసిపోలేదని ఆయన తెలిపారు.
న్యూఢిల్లీలో ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన ఒక పుస్తకావిష్కరణ సభకు హాజరైన ఆయన ‘మీరంతా మే 10న యుద్ధం ముగిసింది అనుకుంటున్నారు.. కానీ అది తప్పు. అది చాలా కాలం కొనసాగింది. ఎందుకంటే దానికి అంతకు మించి ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.