OnePlus Nord 3 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (One Plus) తన వన్ ప్లస్ నార్డ్ 3 5జీ (One Plus Nord 3 5G) ఫోన్‌ను గత జూలైలో ఆవిష్కరించింది. మీడియా టెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఎస్వోసీ చిప్సెట్తో వస్తున్న ఈ ఫోన్ మీద భారీగా డిస్కౌంట్ అందిస్తోంది. 80వాట్ల వైర్డ్ సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ యూఐ వర్షన్‌తో పని చేస్తుందీ ఫోన్. ట్రై-స్టేట్ అలర్ట్ స్లైడర్తోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ ఉంటుంది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
వన్ ప్లస్ నార్డ్ 3 5జీ (One Plus Nord 3 5G) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.33,999, 16 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.37,999 లకు మార్కెట్లో ఆవిష్కరించింది. రెండూ వేరియంట్లు ప్రస్తుతం ఆన్లైన్లో డిస్కౌంట్ ధరలకు అందుబాటులో ఉన్నాయి.
వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లో 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.29,999, 16 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.33,999లకు లభిస్తుందని తెలిపింది. మిస్టీ గ్రీన్, టెంపెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ బ్యాంక్, వన్ కార్డ్ క్రెడిట్ కార్డులపై అదనంగా రూ.2000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్.. హెచ్డీఆర్+ మద్దతుతో 450పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.74-అంగుళాల అమోలెడ్ ప్యానెల్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ఎస్వోసీ చిప్ సెట్‌తో వస్తున్నది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 13 వర్షన్‌పై పని చేస్తుంది.
వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్, 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ సెన్సర్ విత్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగా పిక్సెల్ మాక్రో షూటర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ద్వారా 80వాట్ల వైర్డ్ సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. ఈ ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, జీపీఎస్ కనెక్టివిటీ ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటుంది.