న్యూఢిల్లీ : వన్‌ప్లస్ 10టీ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను ప్రవేశపెట్టిన అనంతరం కంపెనీ వన్‌ప్లస్ 11పై ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది డిసెంబర్లో వన్‌ప్లస్ 11 సిరీస్ లాంఛ్ అవుతుందని చైనాకు చెందిన టెక్ నిపుణుడు అంచనా వేశారు. లేటెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుందని భావిస్తున్నారు.
వన్‌ప్లస్ 11 సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ 11, వన్‌ప్లస్ 11 ప్రొ రానున్నాయి. చిప్సెట్ మినహా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలను ఇంకా కంపెనీ వెల్లడించలేదని చైనాకు చెందిన డిజిటల్ చాట్ స్టేషన్ పేర్కొంది. ఇక వన్‌ప్లస్ ఈ ఏడాది లాంఛ్ చేసిన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 10టీ ప్రొ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌ను వాడగా, 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ముందుకొచ్చింది.
ఇక ఓఐఎస్ సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్769 సెన్సర్, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరాతో పాటు సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 ఎంపీ కెమెరాను కలిగిఉంది. ఇక వన్‌ప్లస్ 11 సిరీస్‌పై కంపెనీ త్వరలోనే అధికారికంగా పలు వివరాలను వెల్లడిస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.