హైదరాబాద్ : హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లిలో విషాదం నెలకొంది. ఏడాది వయసున్న ఓ చిన్నారి ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. చిన్నారి కిందపడ్డ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు.. ఆ పాపను హుటాహుటిన నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి అక్షర ప్రాణాలు కోల్పోయింది. పాప మరణవార్త విన్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.