న్యూఢిల్లీ, జనవరి 31: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ ఓలా స్పీడ్ పెంచింది. ఒకేరోజు ఎనిమిది రకాల స్కూటర్లను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఎస్1 బ్రాండ్‌తో విడుదల చేసిన ఈ స్కూటర్లు రూ.79,999 మొదలుకొని రూ.1,69,999 గరిష్ఠ ధరతో లభించనున్నాయి. జనరేషన్ 3 ప్లాట్‌ఫాంలో భాగంగా అభివృద్ధి చేసిన ఈ స్కూటర్లు వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఎస్1 ఎక్స్, ఎస్1 ఎక్స్+, ఎస్1 ప్రొ, ఎస్1ప్రొ+ పేర్లతో నాలుగు రకాల స్కూటర్లను తెచ్చింది. వీటిలో 5.3 కిలోవాట్ల బ్యాటరీతో తీర్చిదిద్దిన మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 320 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. అలాగే 4 కిలోవాట్లా బ్యాటరీ కలిగిన మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 242 కిలోమీటర్ల దూరం వెళ్లనున్నది.