మహబూబ్‌నగర్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో ఆగస్టు 29న దివ్యాంగులు, పేదలకు చెందిన 75 ఇండ్లను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు బుల్డోజర్లతో కూల్చివేసిన ఘటనపై నిలదీసినందుకు బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. గతంలో డబుల్ బెడ్రూం ఇండ్లకు ఫోర్జరీ సంతకాలు పెట్టి బోగస్ పట్టాలు సృష్టించారని సాక్షాధారాలతో కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన విషయం విదితమే. దీన్ని ఆసరాగా చేసుకొని పేదల ఇండ్లను అక్రమంగా కూల్చివేసి.. వారిని ఆదుకొని అన్నం పెట్టారన్న కక్షతో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తమ్ముడు శ్రీకాంత్‌గౌడ్‌ను కేసులో ఇరికించారు.
సాక్షాధారాలు లేకు న్నా మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి శ్రీకాంత్‌గౌడ్‌పై కేసు నమోదు చేశారు. దీంతో శుక్రవారం సాయంత్రం ఆయన పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. పెట్టిన కేసు అక్రమమని బీఆర్ఎస్ నేతలు ఆ రోపిస్తున్నారు. కేసీఆర్ సర్కారు హయాంలో మంత్రి గా పనిచేసిన శ్రీనివాస్‌గౌడ్ తలుచుకుంటే జీవో నెంబర్ 58 ప్రకారం పేదల ఇండ్లు రెగ్యులరైజ్ చేసి ఇచ్చే వారని.., బో గస్ పత్రాలు సృష్టించాల్సిన అవసరమేమిటని ప్రశ్నిస్తున్నా రు. కాంగ్రెస్ నేతల డైరెక్షన్లో రూరల్ సీఐ గాంధీనాయక్ అత్యుత్సాహం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తున్నది.
సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో దివ్యాంగులు, పేదల ఇండ్లను కూల్చివేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ నేతలు నిలదీశారు. గులాబీ పార్టీ నేతలు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. శ్రీనివాస్‌గౌడ్ సూచనల మేరకు శ్రీకాంత్‌గౌడ్ దగ్గరుండి ఆశ్రయం కల్పించారు. బాధితులందరికీ పది రోజులపాటు ఉచితంగా అన్నదానం చేసి ఆదుకున్నారు. మద్దతు పెరగడంతో కాం గ్రెస్ నాయకులు పేదలను మభ్యపెట్టి బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేయించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దివ్యాంగులు, పేదల నోళ్లను నొక్కి వారికి అండగా నిలిచినందుకు శ్రీకాంత్‌గౌడ్‌పై కేసు నమోదు చేశారు. అన్నం పెట్టినందుకు అక్రమంగా కేసులు పెడతారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ నేతల డైరెక్షన్లో బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా శ్రీకాంత్‌గౌడ్‌ను అరె స్ట్ చేసేందుకు హైదరాబాద్‌లో పథకం రచించినట్లు తెలుస్తున్నది. రెండ్రోజుల కిందట కాంగ్రెస్ చోటామోటా నా యకులు ప్రెస్‌మీట్ పెట్టి శ్రీకాంత్‌గౌడ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం విశేషం. దీంతో మహబూబ్‌నగర్ రూ రల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన డబుల్ బెడ్రూం ఇండ్ల అవకతవకల కేసునే కొనసాగిస్తూ కొత్తగా దీన్ని మార్చి కొంతమందిపై కేసులు నమోదు చేశారు.
శ్రీకాంత్‌గౌడ్‌పై కూడా అక్రమంగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శుక్రవా రం సాయంత్రం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్వయంగా సోదరుడు శ్రీకాంత్‌గౌడ్‌ను తన వాహనంలో తీ సుకొచ్చి రూరల్ పోలీస్‌స్టేషన్ వద్ద దించారు. ఈ మేరకు శ్రీకాంత్‌గౌడ్ పోలీసులకు లొంగిపోయారు. ఇదిలాఉండగా, ప్రభు త్వ భూముల్లో నిర్మాణాలు జరిగితే జీవో నెంబర్ 58 ప్ర కారం రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఉన్నదని, ఇది లీగలైజ్డ్ అని, అవసరమనుకుంటే పేదలకు ఆ జీవో ప్రకారమే అప్పట్లో సర్టిఫికెట్లు ఇప్పించేవారు..అంతేకానీ మాజీ మం త్రి తమ్ముడికి బోగస్ సర్టిఫికెట్లు సృష్టించాల్సిన అవసరమేంటని పోలీసులను బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
శ్రీకాంత్‌గౌడ్ రూరల్ పీఎస్‌కు వచ్చి లొంగిపోయారని మహబూబ్‌నగర్ రూరల్ సీఐ గాంధీనాయక్ తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి కోర్టులో హాజరుపరుస్తామని మీడియాకు వివరించారు. ఆదర్శనగర్‌లో ఏం జరిగిందనే దానిపై తమ వద్ద పూర్తి స్థాయిలో సాక్షాధారాలు ఉన్నాయని.., ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదన్నారు.