ఈఎస్ఐలో అధికారుల తిష్ట
ఈఎస్ఐలో విధులు నిర్వర్తిస్తున్న కొందరు అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీల అవకాశం వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించి తమకున్న పరిచయాలతో పైరవీలు చేస్తూ సుదీర్ఘ కాలంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోనే తిష్టవేశారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 20-30ఏళ్లు గడుస్తున్నా వారు నగరాన్ని వదిలి బయటకు వెళ్లలేదు.
- దశాబ్దాలుగా హైదరాబాద్‌లోనే పోస్టింగ్
- కేంద్ర సర్వీసు అయినప్పటికీ పైరవీలతో నగరం చుట్టూరానే బదిలీలు, పదోన్నతులు
- తాజా బదిలీల్లోనూ మారని సదరు అధికారుల తీరు
- శాఖలోని ఇతర ఉద్యోగులపై పెత్తనం.. వెల్లువెత్తున్న విమర్శలు
- ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న ఉద్యోగులు
ఈఎస్ఐలో విధులు నిర్వర్తిస్తున్న కొందరు అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీల అవకాశం వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించి తమకున్న పరిచయాలతో పైరవీలు చేస్తూ సుదీర్ఘ కాలంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోనే తిష్టవేశారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 20-30ఏళ్లు గడుస్తున్నా వారు నగరాన్ని వదిలి బయటకు వెళ్లలేదు. కొందరు పైరవీలతో, మరికొందరు యూనియన్ల ముసుగులో నగరంలోనే దశాబ్ధకాలంగా తిష్టవేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సదరు అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారి..ఇతర ఉద్యోగులను వివిధ రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు సొంత శాఖలోనే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నలుగురు అధికారులు నగరంలోనే అపాయింట్మెంట్ కావడం, ఇక్కడే పదోన్నతులు పొందడం, ఒకవేళ బదిలీలు జరిగినాహైదరాబాద్, సికింద్రాబాద్ గడప లోపలే పోస్టింగ్‌లు పొందుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అధికారుల విషయమై కొందరు బాధితులు ఇప్పటికే చీఫ్ సెక్రటరీ, ఐఎంఎస్ ఇన్చార్జ్ డైరెక్టర్‌తో పాటు సంబంధిత శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.
సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): సెక్రటరీ(ఎల్ఎస్టీ)గా పనిచేస్తున్న ఒక అధికారి ఐఎంఎస్‌లో 1990లో చేరి, దాదాపు 35సంవత్సరాలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోనే తిష్టవేసినట్లు ఐఎంఎస్ వర్గాల ద్వారా తెలిసింది. పదోన్నతి వచ్చినా, బదిలీ వచ్చినా సదరు అధికారి నగరాన్ని వదిలిపెట్టకుండా తనకున్న పైరవీల బలంతో చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో..
నాచారం ఈఎస్ఐ హాస్పిటల్లో మెడికల్ సూపరింటెండెంట్‌కు పీఎగా విధులు నిర్వర్తిస్తున్న ఒక ఉద్యోగి 1990లో ఐఎంఎస్‌లో చేరి, దాదాపు 28సంవత్సరాలుగా హైదరాబాద్ పరిధిలోనే తిష్టవేశారు. అంతే కాకుండా ప్రస్తుతం నాచారంలో కొనసాగుతున్న పోస్టు కూడా అక్రమమని, సీనియర్ అసిస్టెంట్ హోదాలో ఉన్న వ్యక్తికి ఆఫీస్ సూపరింటెండెంట్ హోదోతో కూడిన మెడికల్ సూపరింటెండెంట్ పీఏ హోదాలో కూర్చోబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నగరం చుట్టే పోస్టింగ్..
నాచారంలోని ఈఎస్ఐ హాస్పిటల్లో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి సైతం సుమారు 28సంవత్సరాలుగా నగరంలోనే తిష్టవేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు అధికారి సైతం బదిలీ అయినా లేక పదోన్నతి వచ్చిన జంటనగరాల్లోనే తిరుగుతున్నట్లు సొంత శాఖలోనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరిగిన బదిలీల్లో సద రు అధికారులకు ఇతర ప్రాంతాల్లో అవకాశాలున్నప్పటికీ అక్కడి బదిలీ చేయకుండా మళ్లీ నగరం చుట్టే పోస్టింగ్‌లు కల్పించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎంఎస్‌లో సాధారణ ఉద్యోగులకు ఒక న్యాయం, పలుకుబడి, పైరవీలు చేసుకునే వారికి మరో న్యాయం జరుగుతోందని సొంత శాఖ వర్గాలే విమర్శించడం గమనార్హం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

