Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Delhi Police : పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణల్లో కొన్ని చోట్లు పోలీసులు, భద్రతా బలగాల్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. కొన్నిచోట్ల పోలీసులపై దాడులు జరిగాయి.
Delhi Police : ఢిల్లీలో అక్టోబర్ 10, శనివారం నాడు సీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిరసన కార్యక్రమం జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధాన్ని అమలు చేశారు. అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ఘర్షణ, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణల్లో కొన్ని చోట్లు పోలీసులు, భద్రతా బలగాల్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు.
కొన్నిచోట్ల పోలీసులపై దాడులు జరిగాయి. దీంతో హింసకు పాల్పడిన వారిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మొత్తం 20కిపైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. శాంతి భద్రతలకు భంగం కలిగించడం, ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారులకు విఘాతం కల్పించడం, పోలీసులపై దాడులు చేయడం వంటి ఘటనలపై 20కిపైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీలో వరుసగా రెండో రోజు ఆదివారం కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఢిల్లీలో అనేక చోట్ల నిర్బంధం కొనసాగుతోంది. బారికేడ్లు రోడ్లపై ఏర్పాటు చేశారు.
మెట్రో సేవలు ఆగిపోయాయి. 30,000కుపైగా పారా మిలిటరీ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం సీజేపీ నిరసన చేపట్టలేకపోయింది. దీంతో ఆదివారం ఉదయం పది గంటలకు కూడా నిరసన చేపడుతామని సీజేపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భద్రతా చర్యాలు ఇంకా కొనసాగుతున్నాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే అనే డిమాండ్‌తో సీజేపీ నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆందోళనలో పాల్గొనకుండా సీజేపీ నేతల్ని పోలీసులు అరెస్టు చేయగా.. కోర్టు వారిని బెయిల్‌పై విడుదల చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

