ఇంద్రవెల్లి : విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ( Collector Rajarshi Shah) అన్నారు. బుధవారం ఇంద్రవెల్లి మండలంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ( Model School ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం(Nutritious Food ) అందించాలని, పారిశుధ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని వసతులు, విద్యార్థుల హాజరు పట్టిక, భోజన మెనూ పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను, వసతి గృహంలోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఇంగ్లీష్ భాషా, సబ్జెక్టుపై నైపుణ్యం పెంచుకోవాలని సూచించి, విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు.
మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, పారిశుధ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల ఆవరణ లోని వాకింగ్ మరమ్మతులు చేపట్టి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
అంతకుముందు పాఠశాలలోని వంట గది, సరుకు నిల్వల గది, భోజన శాల, వసతి గృహాలను పరిశీలించారు. పాఠశాలలో అవసరమైన స్పోర్ట్స్ షూస్, గ్రిజర్స్, ఇతర సౌకర్యాలు, వసతులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ రేఖరాణి, డీఈ శివ ప్రసాద్, పీఈటీ సరిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.