వేములవాడ, ఫిబ్రవరి 11: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెబుతున్న కొందరు గడప దాటని విధానం ఇంకా కొనసాగుతూనే ఉంది. వేములవాడ పురపాలక సంఘం ఎన్నికల్లో మాత్రం ఏకంగా వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి అమెరికా నుండి వచ్చి ఒకరు పురపాలక సంఘం ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం సర్వత్రా హర్ష వ్యక్తమవుతోంది.
అమెరికాలో ఉద్యోగంలో స్థిరపడిన కార్తికేయ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వేములవాడకు వచ్చి 28వ వార్డులో తన ఓటు వినియోగించుకున్నారు. యువతకు ఆయన ఓటుకున్న విలువను గురించి తెలియజేసినట్లుగా స్థానికులు తెలిపారు.