వ్యక్తిగత పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని ఎన్నారై బీఆర్ఎస్ యూకే సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడు హరి గౌడ్ నవాబుపేట, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, కార్యదర్శి (ఐటీ, మీడియా & పీఆర్) రవి ప్రదీప్ పులుసు, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల, యూత్ వింగ్ సెక్రటరీ తరుణ్ లునావత్, యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ అబ్దుల్ ఖుద్దూస్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.