ఈరోజుల్లో జుట్టుకు రంగేయని వారు అరుదు. చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటానికి అనేక కారణాలు. చేసేది లేక.. హెయిర్ డైని ఆశ్రయిస్తుంటారు. అయితే, ఇలా రెగ్యులర్గా డై వేస్తుంటే.. జుట్టు నిజంగానే ‘డై’ అవుతుందని అంటున్నారు నిపుణులు. రసాయన రంగులు జుట్టుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు.
హెయిర్ డైలోని రసాయనాలు జుట్టు పైపొరను తెరుస్తాయి. దీనివల్ల జుట్టులోని సహజ తేమ బయటికి వెళ్లిపోతుంది. జుట్టు నిర్జీవంగా మారుతుంది. డైలోని పెరాక్సైడ్ జుట్టు సహజ వర్ణద్రవ్యాన్ని తొలగిస్తుంది. ఈ ప్రక్రియలో జుట్టులోని ప్రొటీన్లు బలహీనపడి, వెంట్రుకలు గడ్డిలా మారుతాయి. తరచుగా రంగు వేయడం వల్ల జుట్టు కోలుకోవడానికి సమయం ఉండదు. ఫలితంగా వెంట్రుకలు చిట్లిపోవడం మొదలవుతుంది.
మరేం చేయాలి?