పుచ్చకాయకు పరీక్ష
పుచ్చకాయ లేనిదే వేసవిలో రోజు గడవదు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ పండును.. ఎండకాలంలో తినని వారుండరు. కానీ, కొందరు కల్తీరాయుళ్లు.. పుచ్చకాయ ఎరుపు రంగులో ఆకర్షణీయంగా కనిపించడానికి ఎరిత్రోసిన్ అనే సింథటిక్ రంగును ఇంజెక్ట్ చేస్తున్నారు. దీనిని తింటే.. అనేక అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. అయితే, ఈ కల్తీని ఇంట్లోనే చాలా సులభంగా గుర్తించవచ్చు.

- పుచ్చకాయను రెండు ముక్కలుగా కోయాలి. ఒక తెల్లని కాటన్ బాల్ (దూది) తీసుకుని.. పుచ్చకాయ లోపలి ఎర్రటి భాగంపై మెల్లగా రుద్దాలి. ఒకవేళ దూదికి ఎరుపు రంగు అంటుకుంటే.. అందులో ఎరిత్రోసిన్ లాంటి కృత్రిమ రంగు కలిపారని అర్థం. సహజమైన పుచ్చకాయ రంగు.. దూదికి అంత త్వరగా అంటుకోదు. కాటన్ బాల్కు బదులుగా టిష్యూ పేపర్ కూడా వాడొచ్చు.
- పుచ్చకాయలోని ఎర్రటి భాగాన్ని ఒక చిన్న ముక్కగా కోయాలి. ఒక గ్లాసు శుభ్రమైన నీటిని తీసుకొని, ఆ ముక్కను అందులో వేయాలి. 5-10 నిమిషాలపాటు అలాగే వదిలేయాలి.
నీరు వెంటనే గాఢమైన ఎరుపు రంగులోకి మారితే.. కల్తీ జరిగినట్లు గుర్తించాలి. సహజమైన పండు అయితే, నీరు రంగు మారడానికి చాలా సమయం పడుతుంది. అది కూడా చాలా లేత రంగులో ఉంటుంది. - పండు లోపల రంగు అంతా ఒకేలా ఉండకుండా.. అక్కడక్కడా ప్యాచీలుగా (ముదురు ఎరుపు రంగులో) ఉంటే అనుమానించాల్సిందే!
- పుచ్చకాయ పైన ఎక్కడైనా చిన్నచిన్న సూదితో గుచ్చినట్లు రంధ్రాలు ఉన్నాయేమో చూడాలి. ఇంజెక్షన్ ద్వారా రంగును లోపలికి పంపినప్పుడు ఇలాంటి గుర్తులు కనిపిస్తాయి.
- సహజంగా పండిన పుచ్చకాయలో అక్కడక్కడా తెల్లటి పీచులాంటి చారలు ఉంటాయి. కల్తీ జరిగిన పండ్లలో ఇవి కూడా ఎరుపు రంగులోకి మారిపోతాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!