నిర్మాతగా బ్లాక్‌బస్టర్స్‌ని అందుకున్న ఎమ్మెస్ రాజు.. వాన, డర్టీ హరి చిత్రాలతో దర్శకుడిగా కూడా సత్తా చాటారు. తాజాగా ఆయన దర్శకత్వంలో రానున్న చిత్రం ‘అగధ’. మిస్టికల్ డివైన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. గురువారం ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న శ్రవణ్‌రెడ్డి ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. కాగడా చేతబట్టి, చీకట్లో అన్వేషిస్తున్న శ్రవణ్రెడ్డిని ఈ పోస్టర్లో చూడొచ్చు. ఈ పోస్టర్లో ‘అగధ’ అనే టైటిల్ ఆధ్యాత్మికత, ఉద్రిక్తతతో నిండిన వాతావరణాన్ని సూచిస్తున్నది.
ఈ కథలోని దైవిక, ఆధ్యాత్మిక అంశాల చుట్టూ అల్లుకొని ఉన్న ఓ రహస్యాన్ని ఛేదించే ‘సింహా’ పాత్రలో శ్రవణ్‌రెడ్డి నటిస్తున్నాడని, అద్భుతమైన సెట్‌వర్క్, 45 నిమిషాల వీఎఫ్ఎక్స్తో ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని పంచే సినిమా ఇదని మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి, సంగీతం: రాకేష్ వెంకటాపురం, నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు, నిర్మాణం: శ్రీఆదివరాహ ప్రొడక్షన్స్.