డై కావొద్దంటే
ఈరోజుల్లో జుట్టుకు రంగేయని వారు అరుదు. చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటానికి అనేక కారణాలు. చేసేది లేక.. హెయిర్ డైని ఆశ్రయిస్తుంటారు. అయితే, ఇలా రెగ్యులర్గా డై వేస్తుంటే.. జుట్టు నిజంగానే ‘డై’ అవుతుందని అంటున్నారు నిపుణులు. రసాయన రంగులు జుట్టుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు.
ఈరోజుల్లో జుట్టుకు రంగేయని వారు అరుదు. చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటానికి అనేక కారణాలు. చేసేది లేక.. హెయిర్ డైని ఆశ్రయిస్తుంటారు. అయితే, ఇలా రెగ్యులర్గా డై వేస్తుంటే.. జుట్టు నిజంగానే ‘డై’ అవుతుందని అంటున్నారు నిపుణులు. రసాయన రంగులు జుట్టుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు.
హెయిర్ డైలోని రసాయనాలు జుట్టు పైపొరను తెరుస్తాయి. దీనివల్ల జుట్టులోని సహజ తేమ బయటికి వెళ్లిపోతుంది. జుట్టు నిర్జీవంగా మారుతుంది. డైలోని పెరాక్సైడ్ జుట్టు సహజ వర్ణద్రవ్యాన్ని తొలగిస్తుంది. ఈ ప్రక్రియలో జుట్టులోని ప్రొటీన్లు బలహీనపడి, వెంట్రుకలు గడ్డిలా మారుతాయి. తరచుగా రంగు వేయడం వల్ల జుట్టు కోలుకోవడానికి సమయం ఉండదు. ఫలితంగా వెంట్రుకలు చిట్లిపోవడం మొదలవుతుంది.
మరేం చేయాలి?
- రసాయన డైలకు బదులుగా హెన్నా (గోరింటాకు), బీట్రూట్ రసం వంటి సహజ పద్ధతులను ప్రయత్నించండి.
- డై వేసిన జుట్టు కోసమే ప్రత్యేకంగా తయారయ్యే ‘సల్ఫేట్ ఫ్రీ’ షాంపూలను మాత్రమే వాడండి. ఇవి జుట్టులోనినూనెలను తొలగించకుండా శుభ్రపరుస్తాయి.
- కొబ్బరి నూనె, బాదం నూనెను గోరువెచ్చగా చేసి.. కుదుళ్లకుపట్టించడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది.
- డై వేసుకున్న తర్వాత వారానికి ఒకసారైనా జుట్టుకు మాస్క్ వేయండి. అదికూడా పెరుగు, తేనె లాంటివాటితో ఇంట్లో తయారు చేసుకున్నవే వాడండి.
- ఈ సూచనలను రెగ్యులర్గా పాటిస్తే.. జుట్టు అందంగానే కాదు,ఆరోగ్యంగానూ ఉంటుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

