సోషల్‌మీడియాలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి నెలకొన్నది. అంతటా ఫిల్టర్లు, ఎడిటింగ్లు, ఏఐ మాయతోనే నిండిపోయింది. ఈ కృత్రిమత్వానికి విసిగిపోయిన యువత.. ‘ట్రూకాస్టింగ్’ నినాదాన్ని ఎత్తుకున్నది. నిజాన్ని నిర్భయంగా చెబుతూ.. అసలైన వ్యక్తిత్వాన్ని చాటుకుంటున్నది.
డేటింగ్ యాప్స్‌లో రిజిస్టర్ చేసుకునేవాళ్లంతా.. తమను తాము గొప్పగా చూపించుకోవాలనే ప్రయత్నిస్తారు. తమ ఫొటోలను ఎడిట్ చేసి, ఏఐతో లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు. కానీ, ట్రూకాస్టింగ్ చేసేవారు నిజాయతీగా ఉంటారు. ఎటువంటి మొహమాటం లేకుండా.. తమ ఇష్టాయిష్టాలను, అలవాట్లను స్పష్టంగా చెబుతారు. ఎదుటివారికి నచ్చని విషయాలను కూడా పంచుకుంటారు. ఫొటోలను ఏమాత్రం ఎడిట్ చేయకుండా, సహజంగా ఉండేలా చూసుకుంటారు. భాగస్వామితో ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. రిలేషన్షిప్ నుంచి తాము ఏం కోరుకుంటున్నామో.. మొదటి రోజే క్లారిటీగా చెబుతారు. ‘నచ్చితే ఉండు.. లేదంటే వెళ్లు’ అనే ధోరణితోనే ఉంటారు.
ఎందుకింత ప్రాచుర్యం?
‘ట్రూకాస్టింగ్’లో టైమ్ వేస్ట్ కాకుండా ఉంటుంది. తప్పుడు అంచనాలతో పరిచయం పెంచుకుని, తర్వాత ఒకరికొకరు సెట్ అవ్వమని తెలుసుకునేకంటే.. ముందే నిజాయతీగా ఉండటం బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. అలాంటప్పుడే తమకు సరైన భాగస్వామి దొరికే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఎదుటివారిని మెప్పించడానికి లేనిది ఉన్నట్లు నటించాల్సిన అవసరం ఇందులో ఉండదు. దాంతో ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక ముందే అన్నీ నిజాలే చెప్పడం వల్ల అవతలి వ్యక్తికి గౌరవం, నమ్మకం పెరుగుతాయి. అందుకే.. ట్రూకాస్టింగ్ ఇప్పుడు భలేగా ట్రెండ్ అవుతున్నది.
ఎలా చేయాలి?
ట్రూకాస్టింగ్ చేయాలన్నా.. కొన్ని నియమాలు పాటించాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు. లేకుంటే, నిజాలు చెప్పినా.. కొన్నిసార్లు బెడిసికొట్టే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.